- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం డీకే శివకుమార్ (DK Sivakumar) చిక్కుల్లో పడ్డారు. యాపిల్ గజమాలను వేసిన కార్యకర్తలపైకి సగం కొరికిన యాపిల్స్ ను విసరడం తీవ్ర చర్చలకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. తన సొంత నియోజకవర్గ పరిధిలోని హరో హళ్లి పర్యటనలో స్థానిక ప్రజల నుంచి ఊహించని రీతిలో భారీ స్వాగతం అందుకున్నారు. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు కలిసి పూర్తిగా తాజా సేబు పండ్లు (Apples), పూలతో ముస్తాబు చేసిన ఒక భారీ ‘గజమాల’తో సీఎంను ఘనంగా సత్కరించారు. అయితే, ఈ సత్కారం అనంతరం సీఎం చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఆ భారీ యాపిల్ హారాన్ని చూసి ముగ్ధుడైన ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఆ హారంలో ఉన్న ఒక యాపిల్ పండును తీసుకుని కొరికారు. అనంతరం ప్రజల పట్ల తన కృతజ్ఞతను చాటుకునే క్రమంలో.. ఆ హారంలోని మిగతా యాపిల్ పండ్లను ఒక్కొక్కటిగా తీసి అక్కడ గుమికూడిన జనంపైకి సరదాగా విసిరారు. అభిమానులు ఆ పండ్లను పట్టుకోవడానికి పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. కొందరు దీనిని సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా సగం తిన్న పండ్లను విసరడం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.






