వాతావరణ మార్పులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది : ప్రధాని మోడీ

by Disha Web Desk 13 |
వాతావరణ మార్పులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది : ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: వాతవరణ మార్పులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇంట్లోని డిన్నర్ టేబుల్ నుంచే ఇది మొదలు కావాలని చెప్పారు. ఈ విషయంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కోరారు. తాజాగా వరల్డ్ బ్యాంక్ క్లైమేట్ చేంజ్ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు. ‘వాతవరణ మార్పు అనేది సమావేశ మందిరాల నుంచి మాత్రమే కాకుండా ప్రతి ఇంట్లోని డిన్నర్ టేబుల్స్ నుంచి పోరాడాలి. ఇలా జరిగినప్పుడే అది పెద్ద ఉద్యమంగా మారుతుంది. ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని అవగాహన కల్పిస్తే వేగవంతమైన మార్పులకు అవకాశం ఉంటుంది’ అని అన్నారు.

మిషన్ లైఫ్ వాతవరణ మార్పులపై ప్రజాస్వామ్యికరణ పోరాటమని తెలిపారు. రోజువారి సాధారణ చర్యల ద్వారా శక్తివంతంగా మారుతుందని చెప్పారు. శక్తి వనరులు, పర్యావరణం, వాతవరణం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారించేందుకు అంతర్జాతీయ నేతలు అధునాతన కొత్త ఆలోచనలతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో స్త్రీ పురుష నిష్పత్తి మెరుగుపరచడం, బీచ్‌లు, రోడ్లపై పరిశుభ్రత డ్రైవ్‌లు, విద్యుత్ ఆదా విషయాల్లో మార్పులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలతో 22 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదాతో పటు 9 ట్రిలియన్ లీటర్ల నీరు ఆదా, 375 మిలియన్ టన్నుల వ్యర్థాలను రిసైక్లింగ్ చేశామని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ పర్యావరణ రుణాలను 26 నుంచి 35 శాతానికి పెంచిందని తెలిపారు.


Next Story

Most Viewed