ఆర్థిక అభివృద్ధిలో సీఐఎస్ఎఫ్ ది కీలక పాత్ర: అమిత్ షా

by Disha Web Desk 12 |
ఆర్థిక అభివృద్ధిలో సీఐఎస్ఎఫ్ ది కీలక పాత్ర: అమిత్ షా
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: దేశ ఆర్థిక అభివృద్ధిలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శాంతిభద్రతలు సురక్షితంగా ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. హకీంపేట్‌లోని సీఐఎస్ఎఫ్ శిక్షణా కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగిన 54వ సీఐఎస్ఎఫ్ రైసింగ్ డే పరేడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సీఐఎస్ఎఫ్ పటిష్ట భద్రత కల్పిస్తోందని అన్నారు.

అదే సమయంలో ఉగ్రవాదులను అణచి వేయటంలో కూడా సీఐఎస్ఎఫ్ జవాన్లు అమితమైన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారని చెప్పారు. గత ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 129 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు డ్యూటీలో వీర మరణం చెందారన్నారు. వారందరికీ తన నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. 1930లో ఇదే రోజున మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించినట్టు గుర్తు చేశారు.

భవిష్యత్ సవాళ్లను కూడా సీఐఎస్ఎఫ్ జవాన్లు సమర్థంగా ఎదుర్కుంటారన్నా నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ బయట సీఐఎస్ఎఫ్ రైసింగ్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారి అంటూ హైదరాబాద్ లో ఇవి జరగడం ఆనందాన్ని కలిగిస్తున్నట్లు చెప్పారు. వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ కే. లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed