Chennai: తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం.. మాజీ ముఖ్యమంత్రి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి

by Disha Web Desk 1 |
Chennai: తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం.. మాజీ ముఖ్యమంత్రి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400లకు పైగా సీట్లు సాధించి మరో‌సారి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. అందుకు అనుగుణంగా కలిసి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ముఖ్యంగా సౌత్ బెల్ట్‌లో కాషాల జెండాను రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలనే అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం‌ను బీజేపీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అన్నా‌డీఎంకేపై ఆయనను అస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా, పన్నీర్‌సెల్వం రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు బీజేపీ పక్కా ప్లాన్ రచిస్తోంది. అదేవిధంగా కేంద్రంలోని కాషాయ పార్టీ పెద్దలు ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా ఆ నియోజకవర్గం నుంచి నుంచి బీజేపీ అభ్యర్థిని పోటీలు దించబోమని పన్నీర్ సెల్వంకు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed