బెంగళూరులో కలకలం.. పలు హోటళ్లకు బాబు బెదిరింపులు

by samatah |
బెంగళూరులో కలకలం.. పలు హోటళ్లకు బాబు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు హోటళ్లకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ది ఒటెర్రా హోటల్‌తో సహా మూడు ప్రసిద్ధ హోటళ్లకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. తెల్లవారుజామున 2గంటలకు ఈ మెయిల్ గుర్తించిన హోటళ్ల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే సోదాల్లో ఏమీ గుర్తించకపోవడంతో ఈ హెచ్చరికలు నకిలీవని తేల్చారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేపట్టారు.

కాగా, గతంలో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, లక్నో వంటి ప్రధాన నగరాల్లోని పాఠశాలలు ఆస్పత్రులు, అలాగే ఢిల్లీ, ముంబై, గోవా, నాగ్‌పూర్, కోల్‌కతాలోని విమానాశ్రయాలతో పాటు అనేక ప్రభుత్వ భవనాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖకు సైతం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదరింపు వచ్చింది. ఈ ఘటన జరిగిన ఒక రోజులోనే బెంగళూరులో హోటళ్లకు వార్నింగ్స్ రావడం కలకలం రేపింది.

Next Story

Most Viewed