'అభివృద్ధి దశ'లో చంద్రయాన్-4 మిషన్: ఇస్రో ఛైర్మన్

by Dishanational1 |
అభివృద్ధి దశలో చంద్రయాన్-4 మిషన్: ఇస్రో ఛైర్మన్
X

దిశ, నేషనల్ బ్యూరో: చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చంద్రయాన్-4 మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఈ మిషన్ అభివృద్ధి దశలో ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ, ఈ విషయంలో మనదేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు. పంజాబ్ లూథియానాలోని సత్‌పాల్ మిట్టల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చంద్రుడిపై తర్వాత చేపట్టబోయే మిషన్‌కు ఇస్రో కట్టుబడి ఉంది. అంతరిక్ష పరిశోధనతో పాటు పలు రకాల సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. 2040వ దశకం ప్రారంభంలో చంద్రునిపై ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇస్రో నిరంతరం దానిపై పనిచేస్తోందని ఆయన అన్నారు. కాగా, చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుడి మీద నుంచి మట్టి, రాతి నమూనాలను తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా ఉంది. సుమారు 100 రోజుల వరకు పనిచేసేలా, కిలోమీటర్ ప్రాంతం చంద్రుడిపై తిరిగే విధంగా దీన్ని రూపొందిస్తున్నారు.



Next Story