కొన్ని విషయాలు బహిరంగంగా చర్చించలేం

by Disha Web Desk 7 |
కొన్ని విషయాలు బహిరంగంగా చర్చించలేం
X

న్యూఢిల్లీ: చైనా చొరబాటును పార్లమెంట్‌లో చర్చించలేమని.. అది భద్రతకు సంబంధించిన అంశమని సోమవారం కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైనా చొరబాటు అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించాలని మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కోరింది. 'ఈ విషయంలో ప్రభుత్వం స్పందిస్తూ.. కొన్ని అంశాలను బహిరంగంగా పార్లమెంట్‌లో చర్చించలేమని చెప్పింది' అని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

అయితే అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. '27 పార్టీలకు చెందిన 37 మంది నేతలు ఆల్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సజావుగా సాగింది. సభ కూడా సజావుగా సాగేలా ప్రతిపక్షం సహకరిస్తుందని భావిస్తున్నాను. అన్ని అంశాలపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అని జోషి చెప్పారు. అయితే సమావేశం అనంతరం బీజేడీ ఎంపి సస్మిత్ పాత్ర మాట్లాడుతూ... 'ఈ సమావేశాల్లో మహిళల రిజర్వేషన్ బిల్‌కు బీజేడీ అధిక ప్రాధాన్యత ఇవ్వబోతోంది. దీని కోసం మేము పట్టుబడతాం. అంతేకాకుండా ఈ బిల్‌ను పాస్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మమ్మల్ని సమర్థించే వారిని కోరతాం' అని అన్నారు.




Next Story

Most Viewed