కేంద్ర ప్రభుత్వం కండ్లు మూసుకుంది: సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

by Dishanational2 |
కేంద్ర ప్రభుత్వం కండ్లు మూసుకుంది: సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేదం తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినప్పటికీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కండ్లు మూసుకుని కూర్చుంటుందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. తప్పుడు ప్రకటనల ద్వారా దేశాన్ని వక్ర దశలో తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పతంజలి ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబర్‌లో దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..తప్పుడు ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. అలా చేస్తే ఒక్కో ప్రకటనకు రూ. కోటి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అంతేగాక పతంజలి ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే మంగళవారం దీనిపై మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆదేశాలు ఉన్ననప్పటికీ కేంద్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొంది. ఈ తరహా యాడ్స్‌ను వెంటనే అరికట్టాలని సూచించింది. తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలని కేంద్రం తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.


Next Story

Most Viewed