నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రెండు పథకాలపై ఫోకస్

by Rajesh |
నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రెండు పథకాలపై ఫోకస్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో మద్దతుధర, ఇళ్ల పథకంపై కీలక నిర్ణయాలు వెలువడే చాన్స్ ఉంది. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంద రోజు ప్రణాళికపై ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే కేబినెట్ భేటీ తర్వాత ఏ అంశంలో ప్రకటన వస్తుందనేది ఉత్కంఠగా మారింది.Next Story

Most Viewed