కేజ్రీవాల్‌కు భారీ షాక్.. శీష్ మహల్పై విచారణకు కేంద్రం ఆదేశం

by Mahesh |
కేజ్రీవాల్‌కు భారీ షాక్.. శీష్ మహల్పై విచారణకు కేంద్రం ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి నుంచి కేజ్రీవాల్ తేరుకోకముందే.. కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఆయన శీష్ మహల్ (Sheesh Mahal)పై నిర్మాణంపై కేంద్రం విచారణ (Center inquiry)కు ఆదేశించింది. 6 ఫ్లాగ్‌స్టాఫ్ బంగ్లాకు పునర్నిర్మాణంలో దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో దుర్వినియోగం చేశారని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అలాగే ఎన్నికల సమయంలో కూడా ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారని ప్రధాని ఆరోపణ చేశారు.

ఈ క్రమంలో ఢిల్లీలో విజయం సాధించిన వెంటనే ఎన్నికల సమయంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (Central Vigilance Commission) (సివిసి) వివరణాత్మక దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్లో 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ బంగ్లా ఉంది. బీజేపీ నేత విజేందర్ గుప్తా (BJP leader Vijender Gupta) ఫిర్యాదు మేరకు అరవింద్ కేజ్రీవాల్ అధికారిక సీఎం నివాసం (Arvind Kejriwal's official CM residence)పై సీపీడబ్ల్యూ డీ వాస్తవ నివేదిక (CPWD factual report)ను సమర్పించడంతో ఫిబ్రవరి 13న సీవీసీ విచారణ (CVC investigation)కు ఆదేశాలు వచ్చాయి.

షీష్ మహల్ పై ప్రధాన ఆరోపణలు

40,000 చదరపు గజాల (8 ఎకరాలు) విస్తీర్ణంలో విలాసవంతమైన భవనాన్ని (Sheesh Mahal) నిర్మించేందుకు కేజ్రీవాల్ భవన నిబంధనలను ఉల్లంఘించారని గుప్తా ఆరోపించారు. రాజ్‌పూర్ రోడ్‌లోని ప్లాట్ నెం. 45, 47తో సహా ప్రభుత్వ ఆస్తులు (గతంలో టైప్-V ఫ్లాట్‌లలో సీనియర్ అధికారులు, న్యాయమూర్తులు ఉండేవారు), రెండు బంగ్లాలు (8-A & 8-B, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్) కూల్చివేసి కొత్త నివాసంలో విలీనం చేశారని ఫిర్యాదు హైలైట్ చేసింది. మరోవైపు 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాతో నాలుగు ప్రభుత్వ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరారు. నాలుగు ప్రభుత్వ ఆస్తులను అనధికారికంగా విలీనం చేయడం ద్వారా బంగ్లా విస్తరణ జరిగిందని గవర్నర్‌కు రాసిన లేఖలో ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి బంగ్లాలోకి ఉండడానికి వెళ్లరని కూడా ఆయన ప్రకటించారు.

Next Story

Most Viewed