జేఈఈ పేపర్ లీకేజీ కేసులో రష్యన్ వ్యక్తి అరెస్ట్

by Dishanational4 |
జేఈఈ పేపర్ లీకేజీ కేసులో రష్యన్ వ్యక్తి అరెస్ట్
X

న్యూఢిల్లీ: టీసీఎస్ సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్‌కు పాల్పడ్డ రష్యాకు చెందిన వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేశారు. గతేడాది జరిగిన జేఈఈ పరీక్షలో పేపర్ లీకేజీలో మిఖైల్ షార్గిన్ కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ ఆరోపణలు చేసింది. ల్యూకౌట్ నోటీసులు ఉండడంతో గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సీబీఐకి అప్పగించారు. కాగా, పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఐ రష్యన్ వ్యక్తిని విచారణ చేపట్టింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన ఐలియోన్ సాఫ్ట్‌వేర్‌ను టాంపెరింగ్ చేయడంలో ముఖైల్ షార్జిన్ సహాయపడ్డాడని సీబీఐ పేర్కొంది. దీంతోపాటు అఫినిటి ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన డైరక్టర్లు సిద్దార్థ్ కృష్ణ, విశ్వంబర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నేలు పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డారని కేసు నమోదు చేసింది. వీరంతా పరీక్షల్లో అభ్యర్థులకు సహాయపడేందుకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని సహాయపడ్డారని ఆరోపణలు ఉన్నాయి.


Next Story

Most Viewed