మహిళలను ఆ సమయాల్లో పని చేయమని ఒత్తిడి చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

by Disha Web Desk 12 |
UP CM Yogi Adityanath
X

దిశ, వెబ్ డెస్క్: మహిళా ఉద్యోగ కార్మికలును ఉదయం 6 గంటల లోపు అలాగే సాయంత్రం 7 గంటల తర్వాత ఏ మహిళా ఉద్యోగి, కార్మికురాలు చేత బలవంతంగా పని చేయమని ఒత్తిడి చేయకుడదని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ ఉత్తర్వులను జారీ చేశారు. మహిళల రాతపూర్వక అనుమతి లేనిదే నిర్దేశించిన సమయానికి ముందు లేదా.. సమయానికి తర్వాత ఎలాంటి పని చేయమని ఒత్తిడి చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 6 గంటల లోపు, సాయంత్రం తర్వాత పని చేసే మహిళా ఉద్యోగులకు, కార్మికులకు ఉచిత రవాణా, ఆహారం, తగిన రక్షణ ఆయా సంస్థలు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మహిళలు పనిచేసే ప్రాంతాలలో కచ్చితంగా వాష్‌రూమ్‌లు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని యజమానులకు సూచించింది.


Next Story