వికసిత్ భారత్ పై కాగ్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
వికసిత్ భారత్ పై కాగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : 'వికసిత్ భారత్' (Vikasith Bharath) మీద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG) గిరీశ్ చంద్ర ముర్ము సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలు అభివృద్ది చెందకుండా 'వికసిత్ భారత్' లక్ష్యం నెరవేరదని పేర్కొన్నారు. భారత్ లో సమాఖ్య వ్యవస్థ సంపూర్ణం అవలేదన్న చంద్ర ముర్ము.. అసలు గ్రామ సభలకు, స్థానిక సంస్థలకు తగిన గుర్తింపే లేదన్నారు. దేశ జనాభాలో సగం గ్రామాల్లోనే ఉందని, 2047 నాటికి దేశంలో జరిగే అభివృద్దిలో గ్రామాలే ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అందువలన గ్రామాల పాలనకు తగిన వనరులు అందించాలని సూచించారు. ఇలాంటి చర్యలు చేపట్టకుండా 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరలేమని అభిప్రాయ పడ్డారు. స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయితీలకు వెళ్ళే నిధులను సక్రమంగా వినియోగించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని వెల్లడించారు. ఒక్కొకరు ఒక్కో అడుగు వేస్తేనే దేశం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని కాగ్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed