అసోంలో బస్సు ప్రమాదం: 12మంది స్పాట్ డెడ్

by Dishanational2 |
అసోంలో బస్సు ప్రమాదం: 12మంది స్పాట్ డెడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని గోలాగాట్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 12మంది మృతి చెందగా.. మరో 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. గోలాఘాట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం తెల్లవారు జామున 4.30గంటల సమయంలో 45 మంది ప్రయాణికులతో కూడిన బస్సు జిల్లాలోని కమర్‌గావ్ నుంచి తిన్‌సుకియా జిల్లాలోని తిలింగ మందిర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే దేర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతం వద్ద ఎదురుగా వస్తున్న బొగ్గు ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 12మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జోర్హాట్‌లోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Next Story

Most Viewed