ఇదేం పోయేకాలంరా బాబు.. టోల్ చార్జి అడిగినందుకు టోల్ బూత్ నే లేపేసిన జేసీబీ డ్రైవర్

by prasad |
ఇదేం పోయేకాలంరా బాబు..  టోల్ చార్జి అడిగినందుకు టోల్ బూత్ నే లేపేసిన జేసీబీ డ్రైవర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో టోల్ గేట్ల వద్ద గొడవలు పెరిగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనదారులపై టోల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తుంటే మరికొన్ని సందర్భాల్లో వాహనదారులే టోల్ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా టోల్ అడిగారని ఓ బుల్డోజర్ డ్రైవర్ ఏకంగా టోల్ బూత్ లనే ధ్వంసం చేయడం కలకలం రేపింది. యూపీలోని ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి హాపూర్‌ వద్ద గల టోల్ బూత్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు.. సదరు టోల్ బూత్ వద్దకు ఓ బుల్డోజర్ వచ్చింది. దీంతో టోల్ చార్జి చెల్లించాలని టోల్ సిబ్బంది జేసీబీ డ్రైవర్ ను అడిగారు. దీంతో తనను టోల్ అడగడంపై చిర్రెత్తుకుపోయిన జేసీబీ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. బుల్డోజర్ తో అక్కడ ఉన్న టోల్ గేట్ లను ధ్వంసం చేసి అక్కడి నుంచి అదే వాహనంలో పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Next Story

Most Viewed