హమ్ సాథ్ సాథ్ నహీ హైన్.. హనీమూన్ తర్వాత విడాకులు కోరిన భార్య

by Naga Rani Yarlagadda |

సినిమా వేరు.. నిజ జీవితం వేరు అని ఊరికే అనరు. 1999లో వచ్చిన బాలీవుడ్ కుటుంబ కథా చిత్రం హమ్ సాథ్ సాథ్ హైన్ గుర్తుందా..?

హమ్ సాథ్ సాథ్ నహీ హైన్.. హనీమూన్ తర్వాత విడాకులు కోరిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా వేరు.. నిజ జీవితం వేరు అని ఊరికే అనరు. 1999లో వచ్చిన బాలీవుడ్ కుటుంబ కథా చిత్రం హమ్ సాథ్ సాథ్ హైన్ గుర్తుందా..? ఆ సినిమాలో హీరోయిన్ టబు పెళ్లయ్యాక తన భర్తతో పాటు కుటుంబాన్నంతటినీ తీసుకుని హనీమూన్ కు వెళ్తుంది. ఇవి సినిమాలో చూసినపుడు ఎంతో ముచ్చటగా అనిపించినా.. రియల్ లైఫ్ లో మాత్రం కోపం తెప్పిస్తాయన్నది వాస్తవం. అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే కొత్తగా పెళ్లిచేసుకున్న వ్యక్తి కుటుంబంతో కలిసి హనీమూన్ కు వెళ్లగా.. అదే వారి సంసారంలో నిప్పులు పోసింది. హనీమూన్ ట్రిప్ ను ఫ్యామిలీ ట్రిప్ గా మార్చాడని, తన భర్తతో ఏకాంతంగా గడిపే ఛాన్సే లేకుండా పోయిందని వాపోతూ.. ఆ నూతన వధువు విడాకులకు సిద్ధపడింది. కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయిందని సమాచారం. ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసిన ఈ ఘటన.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీలోని పటేల్ నగర్ కు చెందిన.. సింగపూర్ లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివిన యువకుడికి.. మీరట్ జిల్లా రామ్ రాజ్ ప్రాంతానికి చెందిన గ్రాడ్యుయేట్ యువతికి ఓ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పెళ్లి కుదిరింది. అందరు ఆడపిల్లలు మాదిరిగానే ఆ వధువు ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లయ్యాక భర్తతో ఏకాంతంగా గడిపేందుకు ఆ జంట హనీమూన్ కు ప్లాన్ చేసుకుంది. అంతా ఓకే. కానీ.. భార్యకు సర్ ప్రైజ్ చేద్దామనో, పేరెంట్స్ ను సంతోషంగా ఉంచాలనో కానీ.. తన పేరెంట్స్, సోదరి, సోదరుడిని కూడా హనీమూన్ కు వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాడు. కలిసి కాపురం మొదలుపెట్టే ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి హనీమూన్ ఒక మంచి అవకాశమని భావించిన వధువుకు ఈ పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చింది.

భర్తతో ఎక్కడికి వెళ్లినా ఫ్యామిలీ చుట్టూ ఉండటంతో.. తన భర్తతో మనసువిప్పి మాట్లాడే సమయం కూడా దొరకకపోవడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఆ మనోవేదన పెరిగి.. వివాదంగా మారి, ఇద్దరి మధ్యన గొడవలకు దారితీసింది. ఇలాంటి భర్తతో ఉండలేనంటూ.. ఆమె విడాకుల కోసం కోర్టుకెక్కింది. అయితే.. భర్త మాత్రం తన తప్పేంలేదంటున్నాడు. కుటుంబమంతా సంతోషంగా ఉండాలనే వెంటబెట్టుకుని తీసుకెళ్లానని వాదిస్తున్నాడు. అది తమ వ్యక్తిగత సమయం అని, అలాంటపుడు కుటుంబాన్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తారని భార్య వాపోతోంది. ఇద్దరి మధ్య ఉన్న ఆలోచనల వ్యత్యాసమే ఇప్పుడు వారి బంధాన్ని విడదీసేలా ఉంది.

Next Story