Supreme Court: ఆదేశాలను ఎందుకు పాటించట్లేదు?

by Shamantha N |
Supreme Court: ఆదేశాలను ఎందుకు పాటించట్లేదు?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషుల శిక్షల ఉపశమన దరఖాస్తుపై కోర్టు నిర్దేశించిన సమయపాలనను పాటించట్లేదని మండిపడింది. "మేం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఆమోదయోగ్యం కాదు. చేయలేదు. మా ఆదేశాలను యుపి ఎందుకు పాటించడం లేదు? మేము మిమ్మల్ని ఇలా వదిలిపెట్టబోం” అని జస్టిస్ అభయ్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసిహ్ లతో కూడి ధర్మాసనం పేర్కొంది. శిక్ష నుంచి ఉశమనం కోరుతూ దోషి చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దోషుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కోర్టు విమర్శించింది. రిమిషన్ పిటిషన్లపై యూపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. దోషుల ప్రాథమిక హక్కులతో ఆడుకుంటున్నారని మండిపడింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 2-4 నెలలు ఎలా తీసుకుంటారని యోగి సర్కారుని కోర్టు ప్రశ్నించింది.

ఆగస్టు 14 వరకు గడవు

పలు జీవిత ఖైదీలను ముందస్తుగా విడుదల చేయాలంటూ దాఖలైన దరఖాస్తులపై మూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకోవాలని 2022 మే 16న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలావుండగా, చాలా మంది ఖైదీల ముందస్తు విడుదల కోసం వేసిన పిటిషన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆరు వారాల గడువు ఇచ్చింది. జూలై 10న ఈ విషయం విచారణకు వచ్చింది. జైలు అధికారులు తనకు అనుకూలంగా సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ఈ ప్రక్రియలో జాప్యం జరిగినందుకు బాధ్యుల పేర్లతో కూడిన అఫిడవిట్‌ను ఆగస్టు 14లోగా అందజేయాలని యూపీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.



Next Story