'స్కూళ్లల్లో అమ్మాయి, అబ్బాయిలు కలిసి కూర్చుంటే ప్రమాదం'

by Dishanational4 |
స్కూళ్లల్లో అమ్మాయి, అబ్బాయిలు కలిసి కూర్చుంటే ప్రమాదం
X

తిరువనంతపురం: స్కూళ్లల్లో అమ్మాయి, అబ్బాయిలు కలిసి కూర్చుంటే ప్రమాదం జరుగుతుందని కేరళ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్ పీఎంఏ సలామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జెండర్ న్యూట్రాలిటీ వ్యవస్థను తీసుకురావడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'తరగతి గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే చోట కూర్చోవడం వల్ల ప్రమాదం పొంచి ఉంది. స్కూళ్లల్లో అలా కూర్చోపెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వమే వారిని బలవంతంగా కూర్చోబెట్టి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఉంది. దీని వల్ల విద్యార్థులు చదువుపై ఫోకస్ చేయలేరు. ఇది పెద్ద సమస్యగా మారనుంది. ప్రభుత్వం ఇలాంటి విద్యా విధానాన్ని అమలు చేయకుండా ఆపాలి.' అని పేర్కొన్నారు.


Next Story

Most Viewed