ఉద్ధవ్ థాక్రేకు బాంబే కోర్టులో ఊరట

by DishaWebDesk |
ఉద్ధవ్ థాక్రేకు బాంబే కోర్టులో ఊరట
X

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. వచ్చే నెల 5న సెంట్రల్ ముంబైలోని శివాజీ పార్కు గ్రౌండ్‌లో నిర్వహించ తలపెట్టిన 'దసరా ర్యాలీ'కి అనుమతులు ఇచ్చింది. కాగా, శివసేన ఏటా నిర్వహించే దసరా ర్యాలీకి ఈసారి షిండే ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. అదేరోజున, షిండే నేతృత్వంలోని చీలిక శివసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే సైతం ఇదే తరహా అనుమతులు అడిగారని, ఇందులో ఏ ఒక్క వర్గానికి పర్మిషన్ ఇచ్చినా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వెల్లడించింది.

ఈ క్రమంలోనే ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా, బీఎంసీ ఉత్తర్వులు చట్టాన్ని దుర్వినియోగం చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. దసరా ర్యాలీకి అనుమతులు మంజూరు చేసింది. కోర్టు నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం ఆనందం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై తమకున్న నమ్మకం మరోసారి నిరూపితమైందని శివసేన కార్యదర్శి వినాయక్ రౌత్ వెల్లడించారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed