పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం : మ‌ధ్యప్రదేశ్ సీఎం

by Disha Web Desk 13 |
పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం : మ‌ధ్యప్రదేశ్ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: మ‌ధ్యప్రదేశ్‌లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇవాళ ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో స్పందించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలుబ‌డుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ మ్యాజిక్ మార్క్‌ను దాటేసింది. 149 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతున్నది. శివ‌రాజ్ సింగ్ త‌న ట్వీట్‌లో ''భార‌త్ మాతాకీ జై, జ‌న‌తా జ‌నార్దన్‌కి జై''.. అంటూ తెలిపారు. ప్రజ‌ల ఆశ్వీర్వాదంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నట్లు సీఎం శివ‌రాజ్ తెలిపారు.

Next Story

Most Viewed