బీజేపీ కీలక ప్రకటన.. అక్కడ 60 స్థానాల్లో పోటీకి సిద్ధం

by Dishanational2 |
బీజేపీ కీలక ప్రకటన.. అక్కడ 60 స్థానాల్లో పోటీకి సిద్ధం
X

షిల్లాంగ్: మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్టు డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీతో పొత్తు కూడిన బీజేపీ కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 60 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీపీపీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ ఈశాన్య సెక్రటరీ రితురాజ్ సిన్హ గురువారం మీడియాకు వెల్లడించారు. మోడీ పవర్ ట్యాగ్ లైన్ తో మేఘాలయ ఎన్నికల్లో పోటీకి దిగుతామని చెప్పారు. వేగవంతమైన అభివృద్ధి, అవినీతిరహిత ప్రభుత్వం మోడీతో సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఆ తర్వాత కాలంలో బీజేపీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాన దృష్టి సారించింది. దాదాపు మోడీ తన పదవీకాలంలో 50 సార్లకు పైగా ఈశాన్య ప్రాంతంలో పర్యటించారు. ఇప్పటికే కాంగ్రెస్ పోటీ చేయనున్న 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా, మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి.

నాగాలాండ్‌లో 20 స్థానాల్లో పోటీ

మరోవైపు నాగాలాండ్‌లో పోటీ చేయనున్న 20 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఎన్డీపీపీతో కలిసి రాష్ట్రంలో పొత్తు కూడినట్లు ప్రకటించింది. మిగిలినా స్థానాల్లో ఎన్డీపీపీ పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటనలో తెలపింది. నాగాలాండ్ లోనూ ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా, మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి.


Next Story

Most Viewed