బొగ్గు కుంభకోణంపై 'కాంగ్రెస్ ఫైల్స్' కొత్త ఎపిసోడ్‌ను విడుదల చేసిన బీజేపీ

by Mahesh |
బొగ్గు కుంభకోణంపై కాంగ్రెస్ ఫైల్స్ కొత్త ఎపిసోడ్‌ను విడుదల చేసిన బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే 2014లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న క్రమంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీపై వార్ ను తీవ్రతరం చేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలకు సంబంధించిన వీడియోలను తయారు చేసి కాంగ్రెస్ ఫైల్ పేరిట విడుదల చేస్తుంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన భారీ బొగ్గు కుంభకోణాన్ని హైలైట్ చేస్తూ.. బీజేపీ ఓ ష్టాస్ట్-వీడియో సిరీస్ ను మంగళవారం విడుదల చేసింది. "బొగ్గు కుంభకోణంలో నల్లగా మారిన 'హస్తం' (కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం) కథ" అని వీడియో ని షేర్ చేస్తూ బీజేపీ రాసింది. ఈ కుంభకోణం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు ₹1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని బీజేపీ వీడియో లో పేర్కొంది.

Next Story

Most Viewed