పార్లమెంట్‌లో స్పృహ తప్పిపడిపోయిన ఎంపీ

by Mahesh |
పార్లమెంట్‌లో స్పృహ తప్పిపడిపోయిన ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు పార్లమెంటు సభ్యులు పాత పార్లమెంట్ భవనంలో చివరి రోజు కావడంతో ఫోటో సెషన్ కోసం సమావేశమయ్యారు. ఈ క్రమంలో సభ్యులంతా కలిసి ఫోటో దిగేందుకు కూర్చుంటుండగా.. బీజేపీ ఎంపీ నరహరి అమీన్ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన పార్లమెంట్ ఎంపీలు అతనికి నీరు తాగించారు. దీంతో ఆయన సకాలంలో కోలుకుని ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.

ఈ ఫోటో సెషన్ అనంతరం.. పార్లమెంటు సభ్యులు పాత పార్లమెంటుకు తుది వీడ్కోలు పలికారు. సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా ఈరోజు (మంగళవారం) కొత్త పార్లమెంట్ భవనంలో వెళ్లారు. కొత్త పార్లమెంట్ భవనం ఇక నుంచి సభ్యులకు స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాభైంది.

Next Story

Most Viewed