8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా.. అసెంబ్లీ పోల్స్‌లో గెలిచిన నేపథ్యంలో రిజైన్

by Vinod kumar |
8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా.. అసెంబ్లీ పోల్స్‌లో గెలిచిన నేపథ్యంలో రిజైన్
X

న్యూఢిల్లీ: ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంటులోని స్పీకర్ కార్యాలయంలో తమ రాజీనామాలను సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎంపీల్లో 10 మంది బుధవారం ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసిన తర్వాత పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలను సమర్పించారు. జేపీ నడ్డా వారిని స్వయంగా స్పీకర్ కార్యాలయానికి తీసుకెళ్లారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి రాజీనామా సమర్పించిన మధ్యప్రదేశ్ ఎంపీలలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజీనామా చేసిన రాజస్థాన్ ఎంపీలలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారి, కిరోరి లాల్ మీనా.. ఛత్తీస్‌గఢ్ ఎంపీలలో అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు బాబా బాలక్‌నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామాలను సమర్పించలేదు. వారు కూడా త్వరలోనే రాజీనామాలు చేస్తారని సమాచారం.



Next Story

Most Viewed