ఒడిశాలో బీజేపీ హవా.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో లీడ్

by Hajipasha |
ఒడిశాలో బీజేపీ హవా.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో లీడ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు ఉండగా.. బీజేపీ 17 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక బీజేడీ 2 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. ఈ లెక్కన ఒడిశాలో బీజేపీ అనుకూల హవా వీస్తోందని స్పష్టమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని 12 స్థానాల్లో బీజేడీ విజయం సాధించింది. ఈసారి అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ, బీజేడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌కు చెందిన అధికార బీజేడీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.



Next Story

Most Viewed