బిల్కిస్ బానో రేపిస్టులు బ్రహ్మణులు.. సంస్కారవంతులు: సీకే రౌల్జీ

by Dishanational4 |
బిల్కిస్ బానో రేపిస్టులు బ్రహ్మణులు.. సంస్కారవంతులు: సీకే రౌల్జీ
X

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో హత్య కేసులో విడుదలైన దోషులనుద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే సీకే రౌల్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా బ్రహ్మణులని, మంచి సంస్కారం కలిగినవారని పేర్కొన్నారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట్లాడారు. దేశవ్యాప్తంగా విడుదలను వ్యతిరేకిస్తూ చర్చ నడుస్తున్న నేపథ్యంలో వారిని రౌల్జీ వెనకేసుకొచ్చారు. 'వారు నేరానికి పాల్పడ్డారో లేదో నాకు తెలీదు. వారంతా బ్రహ్మణులు. వారికి మంచి సంస్కారం ఉంటుంది. వారిని కార్నర్ చేసి శిక్షించాలని ఎవరికైనా దురుద్దేశం ఉండవచ్చు' అని వారికి మద్దతుగా మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉంటూ రేపిస్టులకు సపోర్టుగా మాట్లాడటాన్ని పలువురు తప్పుబట్టారు. రేపిస్టులను మంచి సంస్కారవంతులని బీజేపీ అభివర్ణిస్తుందని ప్రతిపక్ష నేత విమర్శించారు. ఒక పార్టీ ఎన్నడూ లేని దిగజారుడు స్థాయికి చేరిందని అన్నారు.


Next Story

Most Viewed