దేశంలోనే అతిపెద్ద బంగారు గని

by Disha Web Desk 13 |
దేశంలోనే అతిపెద్ద బంగారు గని
X

పాట్నా: బిహార్‌లోని జాముయ్ జిల్లాలో ఉన్న దేశంలోనే అతిపెద్ద బంగారు గనిలో తవ్వకాలకు అనుమతులిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రంపై సంతకం చేయనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. జాముయ్ జిల్లాలో ఏకంగా 222.88 టన్నుల బంగారం నిల్వలున్నట్టు 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా'(జీఎస్ఐ) అంచనా వేస్తున్నది. 'జాముయ్‌లో ఉన్న గోల్డ్ రిజర్వుల అన్వేషణ ప్రారంభించేందుకు జీఎస్ఐ, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)తో రాష్ట్ర గనుల శాఖ, జియోలజీ డిపార్ట్‌మెంట్‌లు సంప్రదింపులు జరుపుతున్నాయి' అని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, మైన్స్ కమిషనర్ హర్జోత్ కౌర్ తెలిపారు. కాగా, దేశంలోనే అత్యధిక బంగారు నిల్వలు బిహార్‌లో ఉన్నాయని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గతేడాదే లోక్‌సభలో తెలిపారు. 'నేషనల్ మినరల్ ఇన్వెంటరీ ప్రకారం, 2015 నాటికి దేశంలో 501.83 మిలియన్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉండగా, ఒక్క బిహార్‌లోనే 44శాతం (222.885 మిలియన్ టన్నులు) నిల్వలు ఉన్నాయి' జోషి వెల్లడించారు.




Next Story

Most Viewed