ఢిల్లీలో ఆప్ పార్టీకి భారీ షాక్.. బీజేపీ‌లో చేరిన మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే

by Mahesh |
ఢిల్లీలో ఆప్ పార్టీకి భారీ షాక్.. బీజేపీ‌లో చేరిన మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో స్థానాల్లో పోటీ చేసిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఏడు స్థానాల్లో దారుణంగా ఓడిపోవడంతో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి తాజాగా మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ఆప్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్, ఎమ్మెల్యే కర్తార్ సింగ్, మాజీ ఎమ్మెల్యే వీణా ఆనంద్ లు ఈ రోజు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ తో పాటు మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కూడా ఇదే కేసులో తీహార్ జైలులో ఉన్నారు.

Next Story

Most Viewed