‘మోడీ ఇంటి పేరు’ కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్!

by Satheesh |
‘మోడీ ఇంటి పేరు’ కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోడీపై ఇంటిపేరుపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై పాట్నా హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ సందీప్ కుమార్‌తో కూడిన సింగిల్ బెంచ్ సోమవారం ఈ కేసును విచారిస్తూ.. మే 15 వరకు స్టే విధిస్తున్నట్లు వెల్లడించింది. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ పిటిషన్‌తో ఈ కేసు తెరపైకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన పాట్నా హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సూరత్ కోర్టులో ట్రయల్‌లో ఉన్న కేసుపై కింది కోర్టుల్లో ప్రొసీడింగ్స్ అవసరం లేదని తేల్చి చెప్పిందిఇదే విషయాన్ని రాహుల్ గాంధీ కౌన్సిల్ కూడా వెల్లడించింది. ‘మేం క్వాష్ పిటిషన్ వేశాం. ఇప్పటికే సూరత్ కోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది. అలాంటప్పుడు మరో కోర్టులోనూ విచారణ ఎలా చేస్తారు..? ఇది అనైతికం. మే 15 మరోసారి విచారణ చేస్తామని పాట్నా కోర్టు వెల్లడించింది. అప్పటి వరకూ కింది కోర్టుల్లో విచారణ జరపకుండా స్టే విధించింది. రాహుల్ పిటిషన్‌ను పాట్నా హైకోర్టు అంగీకిరించింది.

స్టే ఇచ్చి ఊరటనిచ్చింది. పట్నాలోని కింది కోర్టులో హాజరయ్యే అవసరం ఇకపై రాహుల్‌కి ఉండదు’ అని రాహుల్ తరఫు న్యాయవాది వీరేంద్ర రాథోడ్ మీడియాకు తెలిపారు. కాగా, కర్ణాటకలోని కోలార్‌లో 2019లో రాహుల్ గాంధీ 'మోడీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలపై బీహార్ మాజీ సీఎం సుశీల్ కుమార్ మోడీ పరువునష్టం కేసు వేయగా, ఈ కేసులో ఏప్రిల్ 12న తమముందు హాజరుకావాలని పాట్నా దిగువ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను రాహుల్ గాంధీ పాట్నా హైకోర్టులో సవాలు చేశారు. దీనిపైనే సోమవారం హైకోర్టు మే 15వ తేదీ వరకూ స్టే ఇచ్చింది.

Also Read..

పాట్నా హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

Next Story

Most Viewed