- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
bumper offer: మహిళకు భారీ గుడ్ న్యూస్.. రాఖీ పండుగకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం
దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించారు. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో వినియోగదారులు ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. పండుగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తలు అందిస్తున్నాయి. గత ఏడాది రాఖీ పండుగకు రెండుసార్లు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాఖీ ఆగస్టు 19న ఉండటంతో సామాన్య ప్రజలు ప్రభుత్వాలు శుభవార్త చెబుతాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రక్షాబంధన్ పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్‌పై రూ. 450 తగ్గించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. లాడ్లీ బహనా యోజన కింద ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఇది కేవలం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉన్న 40 లక్షల మందికి లాడ్లీ బహన్, నాన్‌పీఎంయూవై లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు. మోహన్ యాదవ్ ఓ సభలో మాట్లాడుతూ.. “రక్షా బంధన్‌ను 25,000 ప్రదేశాలలో ఏకకాలంలో జరుపుకున్నారు. సోదరీమణులు కూడా తమ ప్రేమను సోదరులకు తెలియజేశారు. మేము ఈ వేడుకను ఆనందంగా జరుపుకోవడం చూసి నేను సంతోషిస్తున్నాను. మన సోదరీమణులకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పథకాన్ని కూడా మన ప్రధాని జారీ చేశారు.
ఇప్పుడు అదే పథకం కింద 450 రూపాయల తగ్గింపును అందిస్తుంది. మా ప్రజలకు ఇలాంటి బోనస్ పథకాలు మరిన్ని అందిస్తాం. రానున్న కాలంలో బియ్యం, పాలపై కూడా బోనస్ ఉంటుంది. అందరి ఆరోగ్యం బాగుండాలంటే పాలు తాగాలి. ఈ రోజు, నేను షియోపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఒకే క్లిక్‌తో దాదాపు 1.29 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాలకు లాడ్లీ బెహనా యోజన కింద రూ. 1,250 రక్షా బంధన్ కోసం రూ. 250 ‘షాగున్’గా బదిలీ చేశాను. సోదరీమణుల ప్రేమ జీవితాంతం అలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ విషయం తెలుసుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.