Big Alert: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..ఈ కొత్త రూల్ తెలుసుకోకుంటే చాలా ఇబ్బందే

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-01 18:16:54.0  )
Big Alert: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..ఈ కొత్త రూల్ తెలుసుకోకుంటే చాలా ఇబ్బందే
X

దిశ, వెబ్‌డెస్క్:ప్రపంచంలోనే భారతీయ రైల్వేలు(Indian Railways) నాల్గవ అతిపెద్ద రైలు వ్యవస్థ. దాదాపు రోజుకి కొన్ని కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. టికెట్‌ ధరలు(Ticket prices) తక్కువ ఉండటంతో మధ్యతరగతి ప్రజలు(Middle class people) సైతం రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతుంటారు. రైలులో ప్రయాణించే చాలా మంది రిజర్వేషన్(Reservation) చేసుకుని ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీని వల్ల ప్రయాణం సుఖంగా ఉంటుంది. ఇదిలా ఉంటే..భారతీయ రైల్వే ప్రయాణికుల(Passengers) కోసం కొత్త నిబంధన(New Rule) తీసుకొచ్చింది. ఇక నుంచి రైలు ప్రయాణాల్లో టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు(Identity card)ను తప్పకుండ తీసుకెళ్లాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు. టీటీఈ(TTE) తనిఖీ చేసినప్పుడు ఐడీ కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లే పరిగణించి భారీ జరిమానా(Fine)విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్‌తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆధార్, ఓటర్ ఐడీ , పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా ప్రయాణికులు టీటీఈకి చూపించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed