Bhuyar: అందమైన అమ్మాయిలు రైతుల కుమారులను పెళ్లి చేసుకోరు: మహారాష్ట్ర ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

by vinod kumar |   ( Updated:2024-10-02 14:30:42.0  )
Bhuyar: అందమైన అమ్మాయిలు రైతుల కుమారులను పెళ్లి చేసుకోరు: మహారాష్ట్ర ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందమైన అమ్మాయిలు రైతుల కొడుకులను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తారని తెలిపారు. ఉత్తమంగా కనిపించే అమ్మాయిలు స్థిరమైన ఉద్యోగంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఇష్టపడతారని తెలిపారు. తాజాగా ఆయన తన నియోజకవర్గం వరుద్ తహసీల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలను మూడు రకాలుగా వర్గీకరించిన ఆయన..‘ఒక అమ్మాయి అత్యంత అందంగా ఉంటే రైతుల కొడుకులను ఇష్టపడదు. ఆమె ఉద్యోగం ఉన్న వ్యక్తిని భర్తగా ఎంపిక చేసుకుంటుంది. అలాగే రెండో స్థానంలో ఉన్న అమ్మాయిలు కాస్త అందం తక్కువగా కనిపించే వారు కిరాణం దుకాణం, పాన్ షాప్ నడిపేవారిని లైక్ చేస్తారు. ఇక మూడో స్థానంలో, అట్టడుగున్న ఉన్న అమ్మాయిలు మాత్రమే వ్యవసాయ కుటుంబంలోని అబ్బాయిని వివాహం చేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మహిళా శిశు అభివృద్ధి మంత్రి యశోమతి ఠాకూర్ తీత్రంగా స్పందించారు. మహిళలను ఉద్దేశిస్తూ భుయార్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. ఆయన ఉపయోగించిన పదజాలం మహిళలను కించపర్చేలా ఉందని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed