కేంద్రం తమ రాష్ట్రం పై వివక్ష చూపిస్తోంది : Mamatha Benarjee

by Disha Web Desk 13 |
కేంద్రం తమ రాష్ట్రం పై వివక్ష చూపిస్తోంది : Mamatha Benarjee
X

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి నిధులు లేకుండానే తమ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నడిపిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఉపాధి హామీ నిధుల విషయంలో కేంద్రం తమ రాష్ట్రం పై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. దాదాపు రూ.6,000 కోట్లు ఈ పథకం ద్వారా రావాలని పేర్కొన్నారు. సోమవారం ఆమె ముర్షీదాబాద్ జిల్లా పాలన సమీక్ష కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్ర నుంచి ఎలాంటి సహాయం లేకుండా ఉపాధి హామీ పథకాన్ని నడిపిస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం 100 రోజుల పనికి సంబంధించిన నిధులు సకాలంలో వెళ్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధించేందుకే పథకాల సమీక్షకు కేంద్ర బృందాలు వచ్చాయని విమర్శించారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీ హౌరా, న్యూ జల్పాయ్ గురి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్షంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, బెంగాల్ ప్రజలకు క్షమాపణ కోరారు.

Next Story

Most Viewed