మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న బీర్ల ధరలు?

by Disha Web Desk 4 |
మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న బీర్ల ధరలు?
X

దిశ, వెబ్ డెస్క్: ఎండలు మండుతున్న వేళ ప్రజలు చల్లని కూల్ డ్రింకులు, పండ్ల రసాలు తాగేందుకు ఆసక్తి చూపుతారు. ఇక వేసవి తాపంతో అల్లాడే మద్యం ప్రియులు బార్ లు, వైన్ షాపుల వద్ద బారులు తీరుతారు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని బీర్లను తాగుతూ కాలక్షపం చేసే మందు బాబులకు ఉహించని చేదువార్త ఎదురైంది. నిన్నటి వరకు రష్యా -ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్‌తో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు బీర్ల ధరలు కూడా పెంచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీరు తయారీకి ఉపయోగించే బార్లీ, ర్లీమాల్ట్ ధరలు పెరగడంతో బీర్ల ధరలను కూడా పెంచాలని కంపెనీలు చూస్తున్నాయి. బార్లీని అధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా రెండవ స్థానంలో ఉండగా.. ఇక ఉక్రెయిన్ రీమాల్ట్ ఉత్పత్తిలో ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బార్లీ, ర్లీమాల్ట్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో కంపెనీదారులకు వ్యయాలు అధికమయ్యాయి. బీర్ల తయారీపై పెట్టిన పెట్టుబడి రాబట్టే క్రమంలో భారాన్నంతా మందు బాబుల నెత్తినే వేసేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.


Next Story

Most Viewed