జమిలి ఎన్నికలతో దేశానికి మేలు: రామ్‌నాథ్ కోవింద్

by Disha Web Desk 10 |
జమిలి ఎన్నికలతో దేశానికి మేలు: రామ్‌నాథ్ కోవింద్
X

రాయ్‌బరేలీ: జమిలి ఎన్నికలు లేదా ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే ఆలోచనకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మద్దతు తెలిపారు. ఇది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా లబ్ధి చేకూరుతుందని, దేశానికి మేలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతివ్వాలని రామ్‌నాథ్ కోవింద్ కోరారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశం అయినందున ఏ పార్టీకైనా దీనివల్ల ప్రయోజనం ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించి, సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి జమిలి ఎన్నికల ద్వారా ఆదా అయ్యే ఖర్చును అభివృద్ధి పనులకు వినియోగించవచ్చు. అది ప్రజలకు మేలు కలిగిస్తుందన్నారు. కాగా, ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి రామ్‌నాథ్‌ కోవింద్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story