సీఎం యోగి కామెంట్స్‌పై భగ్గు .. బరేలీలో ‘జైల్ భరో’కు పోటెత్తిన ముస్లింలు

by Dishanational4 |
సీఎం యోగి కామెంట్స్‌పై భగ్గు .. బరేలీలో ‘జైల్ భరో’కు పోటెత్తిన ముస్లింలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదులను ముస్లింలు స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు నిరసనగా ఇత్తెహాద్ - ఏ - మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజాఖాన్ ‘జైల్ భరో’కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులను అడ్డుకునేందుకు బరేలీలో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. అయినప్పటికీ శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ ముగిసిన వెంటనే వేలాది మంది తౌకీర్ రజాఖాన్ అనుచరులు వీధుల్లోకి వచ్చారు. ఈక్రమంలో తౌకీర్ రజాఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ఘటనపై రజాఖాన్ స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం హింసను కోరుకుంటే మేం సిద్ధంగా ఉన్నాం.. పోలీసులకు, బుల్లెట్లకు మేం భయపడం. ప్రభుత్వం మదర్సాలపై బుల్‌డోజర్‌ నడుపుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు నోటీసులివ్వాలి కానీ అది ప్రభుత్వ ఒత్తిడి మేరకు పని చేస్తోంది’’ అని అభిప్రాయపడ్డారు. బరేలీలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరుగురు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, 12 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను రంగంలోకి దింపారు. గురువారం సాయంత్రం మత ఘర్షణలు జరిగిన ఉత్తరాఖండ్‌‌లోని హల్ద్వానీ పట్టణం యూపీలోని బరేలీకి సమీపంలోనే ఉండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Next Story