- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
మహిళ ఆశ చూపి బంగ్లాదేశ్ ఎంపీ హత్య..? హనీ ట్రాప్‌లో అన్వరుల్ అజీమ్
![మహిళ ఆశ చూపి బంగ్లాదేశ్ ఎంపీ హత్య..? హనీ ట్రాప్‌లో అన్వరుల్ అజీమ్ మహిళ ఆశ చూపి బంగ్లాదేశ్ ఎంపీ హత్య..? హనీ ట్రాప్‌లో అన్వరుల్ అజీమ్](https://www.dishadaily.com/h-upload/2024/05/24/337384-honey-trap.webp)
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఒక మహిళను ఎర వేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల ప్రకారం, సీసీటీవీ ఫుటేజీలో అన్వరుల్ అమెరికాలో నివసించే మిత్రుడు అద్దెకు తీసుకున్న న్యూ టౌన్ ఫ్లాట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి లోపలికి వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు. అయితే మహిళ కావాలనే బంగ్లాదేశ్ ఎంపీని ఆ ఫ్లాట్‌కు తీసుకువెళ్లాలని కోరిందని, ఆయన లోపలికి వెళ్లిన వెంటనే హత్య చేసి ఉంటారని సీఐడీ పోలీసులు తెలిపారు.
అన్వరుల్ హనీ ట్రాప్‌లో పడినట్లుగా స్పష్టంగా తెలుస్తుందని వారు పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి మిత్రుడికి ఆ మహిళ కూడా బాగా పరిచయస్తురాలే. ఈ కేసులో హనీట్రాప్ కోణంతో పాటు, హత్యలో అమెరికా పౌరుడి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి సుమారు రూ.5 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో గురువారం ముంబైకి చెందిన ఓ వ్యక్తని అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది.
మొదటగా ఎంపీని గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత, ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికారు. ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేశారు. తరువాత కుళ్ళిపోకుండా ఉండటానికి శరీర భాగాలకు పసుపు పొడిని రాసి, మరికొన్నింటిని ఫ్రిజ్‌లో ఉంచారు. తరువాత శరీర భాగాలను ట్రాలీ బ్యాగ్‌లో ఉంచి, వేర్వేరు ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడేశారని పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా ఫ్లాట్‌లో రక్తపు మరకలు, శరీర భాగాల తాలుకు గుర్తులను పోలీసులు గుర్తించారు. వైద్య చికిత్స కోసం మే 12న కోల్‌కతా వచ్చిన ఆయన స్నేహితుడు బిశ్వాస్ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత రోజు మధ్యాహ్నం నివాసం నుండి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో ఆయన కోసం గాలించగా తాజాగా హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Read More..
Viral Video: కస్తూర్బా గాంధీ స్కూల్ అమ్మాయిలతో వాచ్మెన్ మసాజ్! అసభ్యకర పనులు!