ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి

by Disha Web Desk 22 |
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి
X

న్యూయార్క్: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై శుక్రవారం దాడి జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని చౌటౌక్వా ఇనిస్టిట్యూషన్‌లో రచయిత సల్మాన్ రష్దీ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రసంగం ఇస్తున్న సమయంలో ఓ వ్యక్తి స్టేజీపైకి దూసుకొచ్చి కత్తితో పొడిచాడు. దీంతో స్థానికులు రష్దీ దగ్గరికి చేరుకుని పొడిచిన చోట రక్తం బయటికి రాకుండా కట్టుకట్టారు. హెలికాప్టర్‌ సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే రష్దీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా రష్దీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా, రష్దీ.. 'ది సాటానిక్ వెర్సెస్' అనే పుస్తకాన్ని 1980లో రాశాడు. ఇస్లాం మతాన్ని దూషిస్తున్నట్లు పుస్తక రచన ఉందని ఆరోపిస్తూ 1988లో ఇరాన్ దేశం పుస్తకాన్ని నిషేధించింది. అప్పటి నుంచే సల్మాన్ రష్దీకి హత్యా బెదిరింపులు పెరిగాయి. ఇటీవల కూడా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. కాగా, సల్మాన్ రష్దీ భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు. గత 20 ఏళ్లుగా అమెరికాలో ఆయన నివాసముంటున్నారు. 1975లో అతని మొదటి నవల వచ్చింది. మిడ్ నైట్స్ చిల్డ్రన్స్ (1981) అనే నవలకు బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు.



Next Story

Most Viewed