- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్ న్యూస్.. ఢిల్లీ సీఎం పదవికి అతిషీ రాజీనామా

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Assembly Election Results) శనివారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అధికార ఆప్ (AAP) పార్టీ.. 22 సీట్లకు పరిమితం అయింది. దీంతో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోనుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీ సీఎం అతిషీ (Delhi CM Atishi).. లెఫ్టినెంట్ గవర్నర్ (Lt. Governor) అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీని కోల్పోవడంతో.. తన సీఎం పదవికి రాజీనామా (Resignation from the post of CM)చేస్తున్నట్టు.. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Lt Governor Vinay Kumar Saxena)కు అతిషీ తన రాజీనామాను సమర్పించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయాన్ని చవిచూసింది, అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal,), మనీష్ సిసోడియా వంటి అగ్రనేతలు ఓడిపోయారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసు (Liquor scam case)లో జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీవాల్.. అనేక ఆరోపణలు మధ్య తన సీఎం పదవికి రాజీనామా (Resignation from the post of CM) చేశారు.
దీంతో సెప్టెంబర్ 21 నుంచి ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అతిషి (Atishi as emergency chief minister)పనిచేస్తున్నారు. కాగా తాజా ఎన్నికల్లో ఆమె తన కల్కాజీ నియోజకవర్గం నుంచి చివరి రెండు రౌండ్లలో లీడ్ దక్కించుకొని విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. అయితే బీజేపీ సీఎం అభ్యర్థి (BJP CM candidate) ఎవరనే దానిపై ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు (National leaders of BJP) చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోమ్ మంత్రి అమిత్ షా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. రేపటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఉండటంతో ఈ రోజు సాయంత్రం లోపు ఢిల్లీకి కాబోయే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.