3 రాష్ట్రాల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్‌కు భారీ షాక్

by Disha Web Desk 13 |
3 రాష్ట్రాల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్‌కు భారీ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్​గఢ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని చూస్తుంటే.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరోమారు ఆధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు షాక్​తగిలింది. అటు ఛత్తీస్​గఢ్‌లో కాస్త పోటీ-పోటీ కనిపిస్తున్నా.. బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.

మధ్యప్రదేశ్‌లో..

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 116 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ 161 సీట్లల్లో లీడ్‌లో దూసుకెళుతోంది. కాంగ్రెస్​ కేవలం 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రాజస్థాన్‌లో..

రాజస్థాన్‌లో బీజేపీ దూసుకెళుతోంది. 200 సీట్లకు 199చోట్ల ఎన్నికలు జరగ్గా.. ట్రెండ్స్​ప్రకారం.. కమలదళం 110 చోట్ల ఆధిక్యంలో దూసుకెళుతోంది. కాంగ్రెస్​73 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. రాజస్థాన్‌లో దశాబ్దాలుగా ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్​అవుతున్నట్టు కనిపిస్తోంది.

ఛత్తీస్​గఢ్‌లో కాంగ్రెస్‌కు షాక్​..

ఛత్తీస్​గఢ్‌లో కాస్త హోరాహోరీ పోరు కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్‌కు గట్టి షాక్​ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 90 సీట్లల్లో 46 స్థానాల మెజారిటీ కావాల్సి ఉండగా.. బీజేపీ ఇప్పటికే 54 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​ కేవలం 34 సీట్లల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో మాత్రం.. కాంగ్రెస్​పార్టీ విజయంవైపు దూసుకెళుతోంది. ఇక మిజోరంలో కూడా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ దీనిని సోమవారానికి వాయిదా వేశారు.

Next Story

Most Viewed