ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాలకు ఉపఎన్నిక

by Disha Web Desk 16 |
ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాలకు ఉపఎన్నిక
X

న్యూఢిల్లీ: దేశంలో వివిధ కారణాలతో పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాల్లో ఉపఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయా స్థానాల్లో ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే నెల 3న ఎన్నిక జరగనుండగా, 6న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఏడు స్థానాలకు ఉపఎన్నిక జరగనున్నాయి. వీటిలో తెలంగాణలోని మునుగోడు కూడా ఉంది. ఇక మిగతా స్థానాలు మహారాష్ట్రలోని తూర్పు అందేరి, బిహార్‌లోని మోకామా, గోపాల్‌గంజ్, హార్యానాలోని అదంపూర్, యూపీలోని గోలా గోక్రానాథ్, ఒడిశాలోని ధామ్ నగర్ ఉన్నాయి.

దీనికి శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది. దాంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపింది. ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగిస్తామని ఈసీ వెల్లడించింది. 'తగిన సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాల సహాయంతో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాం' అని ఈసీ సెక్రటరీ సంజీవ్ కుమార్ ప్రసాద్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఓటర్ గుర్తింపు కోసం ఓటర్ కార్డు లేదా ఎలక్ట్రోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు ప్రాథమిక డాక్యుమెంటుగా పరిగణిస్తామని ఈసీ తెలిపింది. వీటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అనుమతిస్తామని పేర్కొంది.

ముఖ్యమైన తేదీలు:

ఉపఎన్నికల నోటిఫికేషన్- అక్టోబర్ 7

నామినేషన్లు సమర్పించేందుకు తుది గడువు- అక్టోబర్ 14

నామినేషన్ల పరిశీలన- అక్టోబర్ 15

నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ- అక్టోబర్ 17

ఉపఎన్నికల నిర్వహణ- నవంబర్ 3

ఉపఎన్నికల ఫలితాలు- నవంబర్ 6


Next Story

Most Viewed