- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ముస్లిం వివాహ చట్టం రద్దు.. అసోం సంచలన నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్న అసోంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ దిశగా తొలి అడుగు వేసింది. సీఎం హిమంత శర్మ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935’ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర మంత్రి జయంత మల్లాబార్వా మాట్లాడుతూ, ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు వెల్లడించారు. “అసోంలో ముస్లిం వివాహాలు, విడాకులు ఈ చట్టం కింద నమోదుకావు. ఇలాంటి విషయాలన్నీ ప్రత్యేక వివాహ చట్టం కింద ఉండాలని అనుకుంటున్నాం’’ అని తెలిపారు. తాజా నిర్ణయం బాల్య వివాహాలను తగ్గించడంలో దోహదపడుతుందని అన్నారు. ఈ చట్టం కింద వివాహాలను నమోదుచేస్తున్న 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లకు నష్టం జరగకుండా రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, కులం, మతం, ప్రాంతంతో సంబంధంలేకుండా అన్ని అంశాల్లోనూ అందరికీ ఒకే రకమైన చట్టం వర్తింపజేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ నెల 7న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.