జీ20 సమావేశాలకు అస్సాం ఆతిథ్యం.. మొదలైన విదేశీ ప్రతినిధుల రాక

by Disha Web Desk 17 |
జీ20 సమావేశాలకు అస్సాం ఆతిథ్యం.. మొదలైన విదేశీ ప్రతినిధుల రాక
X

గౌహతి: భారత్‌లో తొలి జీ 20 సమావేశాలకు అస్సాం ఆతిథ్యమివ్వనుంది. సస్టైనబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఫిబ్రవరి 2, 3 తేదీల్లో జరగనున్నాయి. విదేశీ ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటున్నారు. జీ 20 సమావేశాలకు ఆతిథ్యమిచ్చేందుకు అస్సాంను ఎంపిక చేయడం నిజంగా గౌరవంగా ఉందని నోడల్ అధికారి ఆదిల్ ఖాన్ అన్నారు.

జీ 20 ఈవెంట్స్‌కు అస్సాంను ఎంపిక చేయడం నిజంగా గర్వకారణం. తొలి సమావేశం సస్టైనబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఫిబ్రవరి 2, 3 తేదీల్లో జరుగుతుంది. ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి' అని ఖాన్ చెప్పారు. అతిథులకు తమ రాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో రుచులను అందిస్తామని ఖాన్ తెలిపారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల (మిల్లెట్స్) సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఆహారం అస్సాం పద్ధతిలో మిల్లెట్స్‌తో ఉంటాయని ఖాన్ పేర్కొన్నారు.

'మన ఆతిథ్యాన్ని అతిథులు కలకాలం గుర్తంచుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అదేశించారు. అతిథులకు మా సంస్కృతి సంప్రదాయలను రుచి చూపిస్తాం. భోజనం అస్సామీ స్టైల్‌లో ఉంటుంది. ఇది అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం కాబట్టి ప్రతి భోజనంలో మిల్లెట్స్ ఉంటాయి' అని ఖాన్ పేర్కొన్నారు. ఈ తొలి సస్టైనబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు గౌహతిలోని హోటల్ రాడిసన్ బ్లూలో ఆతిథ్యమివ్వనుంది. వసుదైవ కుటుంబం నినాదంతో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ థీమ్‌తో ఈ సమావేశాలు జరగనున్నాయి.

Next Story

Most Viewed