మణిపూర్పై కాంగ్రెస్ యుద్ధం చేస్తోంది.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ

by Javid Pasha |
మణిపూర్పై కాంగ్రెస్ యుద్ధం చేస్తోంది.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ పై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోందని ఆరోపించారు. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కేవలం మణిపూర్ కే పరిమితం కాకూడదని, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ లో మహిళలపై జరుగుతోన్న దాడులపై కూడా స్పందించాలని చురకలు అంటించారు.

అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ మణిపూర్‌పై యుద్ధం చేస్తోందని.. కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన కేవలం మణిపూర్‌కే పరిమితం కాకూడదని.. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై జరుగుతున్న తీవ్రమైన నేరాల గురించి కూడా ఆలోచించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆలోచించాలని అన్నారు.

Next Story