ఇండియా కూటమికి రాహుల్ గాంధే పెద్ద సమస్య.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ

by Dishafeatures2 |
ఇండియా కూటమికి  రాహుల్ గాంధే పెద్ద సమస్య.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమికి రాహుల్ గాంధే పెద్ద సమస్య అని అన్నారు. ఆయన మణిపూర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. కానీ భారత్ లో ప్రతి పౌరుడి పట్ల మా నిబద్ధత ఉంటుంది. అది మణిపూర్ అయినా రాజస్థాన్ అయినా లేక బెంగాల్ అయినా అక్కడి ప్రజలంతా తమకు సమానమేనని అన్నారు.

భారత్ గెలుస్తుంది.. భారత్ గెలవాలి అని ఆయన చెప్పారు. కాగా అంతకు ముందు రాహుల్ గాంధీ ఇండియా కూటమిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘మిస్టర్ మోడీ మీరు మమ్మల్ని ఏ విధంగానైనా పిలవండి. మేము మాత్రం ఇండియా’ అన్నారు. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బదులిస్తూ అస్సాం సీఎం పై విధంగా స్పందించారు.

Next Story