ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ పేరు తీసేసిన అస్సాం సీఎం.. కారణం ఇదే

by Dishafeatures2 |
ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ పేరు తీసేసిన అస్సాం సీఎం.. కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. కాగా తాజాగా హిమంత బిస్వా శర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇండియా (INDIA)కు బదులు భారత్ (BHARAT) అని మార్చారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన గత ట్విట్టర్ బయోలో అస్సాం, INDIA అని ఉండేదని చెప్పారు. కానీ తాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి మారాక బయోను మార్చడం మరిచిపోయాయని అన్నారు. అందుకే తన బయోను అస్సాం, INDIA నుంచి అస్సాం, BHARAT అని మార్చానని, అందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు.

తాను తన బయోను ఎందుకు మార్చానోనని కొందరు కాంగ్రెస్ మిత్రులు అడుగుతున్నారన్న హిమంత బిస్వా శర్మ.. వాళ్లకు నా ఈ సమాధానం సరిపోతుందని అనుకుంటాను అని స్పష్టం చేశారు. కాగా ఇటీవల బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో విపక్షాలకు చెందిన పార్టీలు తమ కూటమికి ఇండియా (INDIA) అని పేరును ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలోనే NDAకి చెందిన హిమంత బిస్వా శర్మ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించి భారత్ అని పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది.


Next Story