భారత్‌ది నాగరిక ప్రజాస్వామ్యం: హిమంత బిస్వ శర్మ

by Disha Web Desk 21 |
భారత్‌ది నాగరిక ప్రజాస్వామ్యం: హిమంత బిస్వ శర్మ
X

డిస్పూర్: అసోం సీఎం హిమంత బిస్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం రాజ్యాంగబద్ధం కాదని, నాగరికత ప్రజాస్వామ్యమని అన్నారు. గురువారం గువహటిలో లోక్‌మంథన్ కాన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు. భారత నాగరికతపై వామపక్షాలు లౌకికవాదుల దాడికి వ్యతిరేకంగా సమిష్టి ప్రతిస్పందన అవసరమని అన్నారు. 'భారతదేశం 1947లో ఏర్పడిన భౌగోళికం కాదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

భారతదేశం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం కాదు. ఇది నాగరికత ప్రజాస్వామ్యం' అని పేర్కొన్నారు. భారత నాగరికత అతి పురాతనమైనదని పేర్కొన్నారు. యూరోపియన్ సామ్రాజ్యవాదం అనేక దేశాల సంస్కృతిని నాశనం చేసిన, భారత సంస్కృతిని, సమాజాన్ని ధ్వంసం చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.


Next Story