- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
రాజస్థాన్ సీఎంగా సీపీ జోషి!

జైపూర్: రాజస్థాన్‌లో సీఎం మార్పునకు సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల కావడంతో అశోక్ గెహ్లట్ బరిలోకి దిగే అవకాశాలు ఉండడంతో ఈ నేపథ్యంలో తన స్థానంలో సీఎం పదవికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని సూచించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బుధవారం గెహ్లట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను కూడా ఎన్నికల బరిలో ఉన్నారని హింట్ ఇచ్చారు. అయితే ఒక వ్యక్తికి ఒకే పదవి అని కాంగ్రెస్ తాజా తీర్మానం నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అశోక్ గెహ్లట్ సీఎంగా కొనసాగాల్సి ఉంది.
2020లో ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న స్థితిలో గెహ్లట్‌కు జోషి అండగా నిలిచారు. ప్రభుత్వంపై తిరుగుబాటు ఎగురవేసిన 19 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హత నోటీసులను జారీ చేశారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించాలని ఇప్పటికే సోనియా పేర్కొన్నారు. దీంతో ఒకవేళ అధ్యక్ష బరిలో ఉంటే, తప్పనిసరిగా సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటినుంచో సీఎం పదవిపై కన్నేసిన సచిన్ ఫైలట్ భవితవ్యంపై అధిష్టానం వైఖరి తేలాల్సి ఉంది.