కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు.. ఢిల్లీ హైకోర్టుకు ఆప్ అధినేత

by Dishanational6 |
కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు.. ఢిల్లీ హైకోర్టుకు ఆప్ అధినేత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈడీ సమన్లను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఈ పిటషన్ పై బుధవారం విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కింద కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ కు ఎనిమిసార్లు సమన్లు పంపింది. ఆరుసార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో.. దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కాగా బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే కేజ్రీవాల్ కు తొమ్మిదోసారి సమన్లు పంపింది ఈడీ. మార్చి 21న తమ ఎదుట హాజరు కావాలని తెలిపింది. దీంతో ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈకేసులో న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా.. లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా పలువురు వ్యాపారులను అరెస్టు చేసింది. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ గతవారం అరెస్టు చేసింది.


Next Story