ఇండియా గేట్ వద్ద మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల ప్రదర్శన

by Disha Web Desk 17 |
ఇండియా గేట్ వద్ద మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల ప్రదర్శన
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భారత సైన్యం 'మేడ్ ఇన్ ఇండియా' ఆయుధాలను మంగళవారం ప్రదర్శించింది. ఇండియా గేట్ వద్ద ప్రదర్శించిన ఆయుధాల్లో స్వదేశంలో తయారైన యుద్ధ ట్యాంక్‌తో పాటు సూపర్ సోనిక్ మిసైల్ బ్రహ్మోస్, ఆకాశ్ ఎయిర్ మిసైల్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ ప్రదర్శనలో కె-9 వజ్రా, ఎంబిటి అర్జున్, మిస్సైల్స్‌ను తరలించే నాగ్ యాంటీ ట్యాంక్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్ కూడా పాల్గొన్నాయి. 'ఈ రోజుల్లో వాడుతున్న అధునాతన ఆయుధాల్లో ఆకాశ్ మిసైల్ ఒకటి. ఈ ఆయుధాన్ని భారత్ డైనమిక్స్, డీఆర్‌డీఓ తయారు చేశాయి. మొబైల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ సిస్టమ్‌ను తయారు చేశారు' అని కెప్టెన్ శివశిష్ సోలంకి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వీక్షించే చాలా పెద్ద ఈవెంట్ రిపబ్లిక్ డే అని సోలంకి అన్నారు. 'రిపబ్లిక్ పరేడ్‌లో నా రెజిమెంట్, ఇంజినీర్లు ప్రాతినిధ్యం వహించే భాగ్యం లభించడం నిజంగా మాకు గర్వంగాను, గౌరవంగాను ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ వీక్షించే రిపబ్లిక్ డే పరేడ్ భారత్‌కు అతిపెద్ద ఈవెంట్' అని శివశిష్ సోలంకి పేర్కొన్నారు.


Next Story

Most Viewed